Skip to main content

కరోనా స‌మాచారం కోసం ప్రత్యేక వెబ్‌సైట్ రూప‌క‌ల్పన

భార‌త్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఎన్ని కోవిడ్‌-19 (కరోనా వైర‌స్‌) పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయో తెల‌సుకునేందుకు గోవాకు చెందిన విద్యార్థులు కరోనా ట్రాకర్‌ (www.coronatracker.in) వెబ్‌సైట్‌ను రూపొందించారు.
Current Affairs

గోవాకు చెందిన 19 ఏళ్ల ఇంజనీరింగ్‌ విద్యార్థి శ్రీ కెనీ, అతని స్నేహితులు సలీల్‌ నాయక్, నికేత్‌ కామత్, రిషికేశ్‌ భండారీ, సాకేత్‌ మరాఠేతో కలసి కరోనా ట్రాకర్‌ను డిజైన్‌ చేశాడు. ఇది యాప్‌ రూపంలోనూ లభిస్తుంది. హప్‌కిన్స్‌ యూనివర్సిటీ మరికొన్ని నమ్మకమైన ఎన్జీవోలు ఇచ్చిన స‌మాచారం ఆధారంగా ఈ యాప్‌లో సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతంలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన.. ఆ ప్రాంతాలను మార్క్‌ చేసి చూపిస్తుంది.

లాక్‌డౌన్ పొడిగింపు లేదు: కేంద్ర ప్రభుత్వం
కోవిడ్-19 కార‌ణంగా దేశంలో ఏప్రిల్‌ 14వ తేదీ వరకూ విధించిన లాక్‌డౌన్‌ను పొడిగించే ఆలోచన లేద‌ని కేంద్ర ప్రభుత్వం మార్చి 30న తెలిపింది. లాక్‌డౌన్‌ మరింత కాలం కొనసాగితే ఆర్థికంగా, సామాజికంగా అనేక విపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆంచనాలు బలపడుతున్న సమయంలో ప్రభుత్వం నుంచి ఈ స్పష్టీకరణ వ‌చ్చింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : కరోనా ట్రాకర్‌ వెబ్‌సైట్ రూప‌క‌ల్పన
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : గోవాకు చెందిన విద్యార్థులు
ఎందుకు : క‌రోనా వైర‌స్ స‌మాచారం అందుబాటులోకి తెచ్చేందుకు
Published date : 31 Mar 2020 06:30PM

Photo Stories