కరోనా పరీక్షల్లో ఏపీకి రెండో స్థానం
Sakshi Education
కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండోస్థానానికి ఎగబాకింది.
ఇప్పటి వరకూ ఏపీ కంటే ముందు వరుసలో ఉన్న కేరళను వెనక్కినెట్టి 2వ స్థానానికి చేరుకుంది.
- జాతీయ సగటులో మిలియన్ జనాభాకు 268 మందికి పరీక్షలు చేస్తుండగా.. ఏపీలో మాత్రం 539 పరీక్షలు చేస్తున్నారు.
- ఒక్క రాజస్థాన్ మినహా మిగతా రాష్ట్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ కంటే వెనుకంజలోనే ఉన్నాయి.
- పెద్ద రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్ మాత్రం చాలా వెనుకబడి ఉన్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఏప్రిల్ 19న విడుదల చేసిన గణాంకాలను బట్టి తేలింది.
- బెంగాల్‌లో మిలియన్ జనాభాకు 51 మందికే పరీక్షలు చేస్తున్నారు.
తాజా గణాంకాల ప్రకారం మిలియన్ జనాభాకు 300కు పైగా పరీక్షలు చేసిన రాష్ట్రాలు..
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరోనా పరీక్షల్లో రెండో స్థానం
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్
ఎక్కడ : దేశంలో
Published date : 20 Apr 2020 06:28PM