కరోనా పరీక్షల కోసం మొబైల్ వైరాలజీ ల్యాబ్
Sakshi Education
ఇప్పటివరకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ల్యాబ్‌లకే పరిమితం కాగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మొబైల్ వైరాలజీ కంటెయినర్ ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.
అంతర్జాతీయ ప్రమాణాలతో బీఎస్‌ఎల్–3 ల్యాబ్‌ను నిమ్స్, డీఆర్డీఓ శాస్త్రవేత్తల బృందం రూపొందించింది. ఈ ల్యాబ్ రూపకల్పన, డిజైన్‌ను నిమ్స్ ఆస్పత్రి రీసెర్చ్ డెవలప్‌మెంట్ అధిపతి డాక్టర్ మధుమోహన్‌రావు అందించగా, ఈఎస్‌ఐ వైద్య కళాశాల డీన్ డాక్టర్ శ్రీనివాస్ దీనికి సంపూర్ణ సహకారం అందించారు. 2020, ఏప్రిల్ 22 లేదా 23 తేదీల్లో తొలుత ఈ ల్యాబ్‌ను ఈఎస్‌ఐ ఆస్పత్రి ఆవరణలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ల్యాబ్‌కు డీఆర్‌డీఓ శాస్త్రవేత్తల బృందం సభ్యులు డాక్టర్ వై.శ్రీనివాస్, ఎంఎస్‌ఆర్ ప్రసాద్, బీఎల్‌వీఎస్ నారాయణమూర్తి మొబైల్ కంటెయినర్ నిర్మాణానికి కావాల్సిన సాంకేతికతను అందించారు. దీనికి కావాల్సిన రెండు భారీ కంటెయినర్లను ఐకామ్ సంస్థ ఉచితంగా తయారు చేసి ఇచ్చింది. ఈ కంటెయినర్లలో బయోసేఫ్టీ లెవల్ (బీఎస్‌ఎల్)–3 ప్రమాణాలతో కూడిన ప్రయోగశాలను కేవలం 15 రోజుల్లో సిద్ధం చేసింది. సాధారణంగా ఇలాంటి ల్యాబ్‌ను రూపొందించాలంటే కనీసం ఆర్నెల్ల సమయం పడుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అందుబాటులోకి మొబైల్ వైరాలజీ కంటెయినర్ ల్యాబ్
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ఎందుకు : కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల నిర్వహణ కోసం
క్విక్ రివ్యూ :
ఏమిటి : అందుబాటులోకి మొబైల్ వైరాలజీ కంటెయినర్ ల్యాబ్
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ఎందుకు : కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల నిర్వహణ కోసం
Published date : 20 Apr 2020 07:11PM