కరోనా మరణాలకూ బీమా పరిహారం
Sakshi Education
జీవిత బీమా పరిహార ప్రయోజనాలను కోవిడ్-19(కరోనా వైరస్) బారిన పడిన పాలసీదారుల కుటుంబాలకు కూడా అందించనున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ వెల్లడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరోనా మరణాలకూ బీమా పరిహారం
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్
కరోనాతో మరణించిన పాలసీదారుల క్లెయిమ్స్‌కు సైతం బీమా సంస్థలు చెల్లింపులు జరుపుతాయని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బీమా సంస్థలు ఇందుకు కట్టుబడి ఉన్నాయని తెలిపింది. ఈ విషయాన్ని ఇప్పటికే కస్టమర్లకు తెలియజేశాయని లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ వివరించింది. కరోనా క్లెయిమ్స్‌కు ఫోర్స్ మెజూర్ నిబంధన వర్తింపచేయడం లేదని తెలిపింది. సాధారణంగా ఊహించని, నియంత్రించలేని కారణాలతో తలెత్తే క్లెయిమ్‌లను ఈ నిబంధన కింద బీమా సంస్థలు తిరస్కరించవచ్చు. కరోనా వ్యాధికి కూడా ఇది వర్తిస్తుందేమోనని పాలసీదారుల్లో సందేహాలు నెలకొన్న నేపథ్యంలో లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఈ మేరకు వివరణ ఇచ్చింది. ప్రస్తుతం లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్‌గా ఎస్‌ఎన్ భట్టాచార్య ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరోనా మరణాలకూ బీమా పరిహారం
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్
Published date : 07 Apr 2020 06:16PM