కరోనా జంతువుల నుంచే పుట్టింది: డబ్ల్యూహెచ్‌ఓ
Sakshi Education
కరోనా వైరస్ పుట్టుకకు జంతువులే కారణమని, ల్యాబ్‌లో వైరస్ ఉద్భవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది.
అన్నిరకాల ఆధారాలు కరోనా వైరస్ పుట్టుకకు జంతువులే కారణమని రుజువు చేస్తున్నాయని ఏప్రిల్ 21న తెలిపింది. కోవిడ్-19 లేబొరెటరీలో సృష్టించింది కాదని స్పష్టం చేసింది. అయితే గబ్బిలాల నుంచి మనుషులకు కరోనా ఎలా వ్యాపించిందన్న విషయంపై ఇంకా పూర్తి వివరాలు కనుగొనాల్సి ఉందని పేర్కొంది.
ప్రపంచానికి చెమటలు పట్టిస్తోన్న కరోనా వైరస్ చైనాలోని వూహాన్ వైరాలజీ ల్యాబ్‌లో జన్మించిందంటూ అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ఇతర నిపుణులు సైతం అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే వైరస్ తమ సృష్టి కాదని, అపనవసరంగా నిందలు వేయడం తగదని వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అధికారులు ఆ వార్తలను ఖండిస్తూ వచ్చారు. తాజాగా ఇదే అభిప్రాయాన్ని డబ్ల్యూహెచ్‌వో వ్యక్తం చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరోనా జంతువుల నుంచే పుట్టింది
ఎప్పుడు : ఏప్రిల్ 21
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)
ఎందుకు : కరోనా వైరస్ చైనాలోని వూహాన్ వైరాలజీ ల్యాబ్‌లో జన్మించిందంటూ అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరోనా జంతువుల నుంచే పుట్టింది
ఎప్పుడు : ఏప్రిల్ 21
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)
ఎందుకు : కరోనా వైరస్ చైనాలోని వూహాన్ వైరాలజీ ల్యాబ్‌లో జన్మించిందంటూ అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో
Published date : 22 Apr 2020 06:38PM