Skip to main content

క‌రోనా బాధితుల‌కు ప్లాస్మా చికిత్స: ఢిల్లీ సీఎం

క‌రోనా సోకిన వారికి త్వర‌లోనే ప్లాస్మా చికిత్స ద్వారా ట్రీట్‌మెంట్ అందించేందుకు ట్రయ‌ల్స్ ప్రారంభించామ‌ని ఢిల్లీ ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 16న ప్రక‌టించారు.
Current Affairs
దీనికి సంబంధించి కేంద్రం నుంచి అనుమ‌తి ల‌భించింద‌ని తెలిపారు. రాబోయే 3-4 రోజుల్లో దీనికి సంబంధించిన ట్రయ‌ల్స్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని, ఇది విజ‌య‌వంత‌మైతే త్వర‌లోనే కరోనా రోగుల‌కు ఈ విధ‌మైన చికిత్స అందిస్తామ‌ని వెల్లడించారు.
కరోనా నివారణకు మందు ఇంతవరకు ఎవరు కనుక్కొలేదు. ప్లాస్మా థెర‌పీలో క‌రోనా సోకి కోలుకున్న వ్యక్తి శ‌రీరం నుంచి ర‌క్తాన్ని సేక‌రించి.. అందులో ఉండే ప్లాస్మాను వేరు చేస్తారు. ఆ ప్లాస్మాను ప్రాణాపాయ స్థితిలో ఉన్న క‌రోనా రోగి ర‌క్తంలోకి ఎక్కిస్తారు. దీంతో 2 రోజుల్లోనే ఆ రోగి సాధార‌ణ స్థితికి చేరుకుంటాడు. ఈ క్రమంలో క‌రోనా వ‌చ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ఈ విధానం ద్వారా రోగుల‌ను బ‌తికించేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ ప్రక్రియ అగ్ర రాజ్యం అమెరికాతో పాటు చైనాలో సక్సెస్ కావడంతో కరోనా అధికంగా ఉన్న ఇటలీ, స్పెయిన్, జర్మనీ, బ్రిటన్ లలో కూడా ప్లాస్మా ధెరపికి వైద్యులు మొగ్గు చూపుతున్నారు. మన దేశంలో కూడా ప్లాస్మా థెరిపికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కేరళకు అనుమతిచ్చింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : క‌రోనా సోకిన వారికి త్వర‌లోనే ప్లాస్మా చికిత్స ద్వారా ట్రీట్‌మెంట్
ఎప్పుడు : ఏప్రిల్ 16
ఎవరు : ఢిల్లీ ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్
Published date : 17 Apr 2020 06:29PM

Photo Stories