కర్ణాటకలో మహిళలకు నైట్‌షిఫ్ట్ అవకాశం
Sakshi Education
మహిళలు నైట్‌షిఫ్ట్‌లో (రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు) పనిచేసేందుకు అవకాశం కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం నవంబర్ 20న ప్రకటన విడుదల చేసింది.
పరిశ్రమల చట్టం కింద నమోదైన పరిశ్రమల్లో మహిళలు రాత్రిపూట పనిచేయవచ్చని తెలిపింది. అయితే దీనికి పలు నిబంధనలు పాటించాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇష్టపూర్వకంగా పనిచేస్తున్నామని మహిళల నుంచి లేఖలు తీసుకోవాలని చెప్పింది. కనీసం 10 మంది మహిళా ఉద్యోగులు ఉండాలని, మహిళలు పనిచేసే చోట పూర్తి వెలుతురుతో పాటు సీసీకెమెరాల పర్యవేక్షణ ఉండాలని తెలిపింది. ఇప్పటివరకూ ఐటీ పరిశ్రమ, ఐటీ అనుబంధ విభాగాల్లో మాత్రమే మహిళల నైట్ షిఫ్ట్‌లకు అనుమతి ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పరిశ్రమల చట్టం కింద నమోదైన పరిశ్రమల్లో మహిళలు నైట్‌షిఫ్ట్‌లో పనిచేసేందుకు అవకాశం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : కర్ణాటక ప్రభుత్వం
ఎక్కడ : కర్ణాటక
క్విక్ రివ్యూ :
ఏమిటి : పరిశ్రమల చట్టం కింద నమోదైన పరిశ్రమల్లో మహిళలు నైట్‌షిఫ్ట్‌లో పనిచేసేందుకు అవకాశం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : కర్ణాటక ప్రభుత్వం
ఎక్కడ : కర్ణాటక
Published date : 21 Nov 2019 06:00PM