కర్ణాటకలో అమిత్ షా ఏరియల్ సర్వే
Sakshi Education
కర్ణాటక, మహారాష్ట్రల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆగస్టు 11న ఏరియల్ సర్వే నిర్వహించారు.
కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి బెళగావి, బాగల్‌కోటే, ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా స్పందిస్తూ.. ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయన్నారు.
వరదల కారణంగా 201 మంది మృతి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. వరదలు, కొండచరియలు, గోడలు విరిగిపడటం తదితర కారణాలతో ఆగస్టు 11నాటికి కేరళలో 72 మంది చనిపోగా, మధ్యప్రదేశ్‌లో 32 మంది మహారాష్ట్రలో 35 మంది, గుజరాత్‌లో 31 మంది, కర్ణాటకలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 201కు చేరుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏరియల్ సర్వే
ఎప్పుడు : ఆగస్టు 11
ఎక్కడ : కర్ణాటక, మహారాష్ట్రల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో

Published date : 12 Aug 2019 05:48PM