కర్ణాటక విధాన పరిషత్ డిప్యూటీ చైర్మన్ ఆత్మహత్య
Sakshi Education
కర్ణాటక విధాన పరిషత్ (శాసన మండలి) డిప్యూటీ చైర్మన్ ఎస్‌ఎల్ ధర్మేగౌడ (65) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా గుణసాగర సమీపంలో రైలు పట్టాలపై డిసెంబర్ 29న ఆయన మృతదేహం కనిపించింది. డిసెంబర్ 29న సరపనహళ్లిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. ధర్మేగౌడ 2004లో జేడీఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. డిసెంబర్ 15న కర్ణాటక విధానపరిషత్‌లో తీవ్ర రభస జరగడం తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్సీ, పరిషత్ చైర్మన్ ప్రతాపచంద్రశెట్టికి బదులు ఆ స్థానంలో ధర్మేగౌడను అధికార బీజేపీ, జేడీఎస్‌లు కలిసి కూర్చోబెట్టడం, నచ్చని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ధర్మేగౌడను సీటులో నుంచి లాగి పడేయడం తెలిసిందే.
Published date : 30 Dec 2020 06:03PM