క్రికెట్‌కు ప్రజ్ఞాన్ ఓజా వీడ్కోలు
Sakshi Education
టీమిండియా మాజీ లెఫ్మార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకూ వీడ్కోలు పలికాడు.
అంతర్జాతీయ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఫిబ్రవరి 21న ఓజా ప్రకటించాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన 33 ఏళ్ల ఓజా భారత్ తరఫున 24 టెస్టుల్లో 113 వికెట్లు, 18 వన్డేల్లో 21 వికెట్లు, 6 టీ20ల్లో 10 వికెట్లు సాధించాడు. చివరగా 2013లో వెస్టిండీస్‌పై టెస్టు ఆడాడు. ఐపీఎల్‌లో డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ కు ప్రాతినిథ్యం వహించాడు. 2014లో ఆయన బౌలింగ్ యాక్షన్‌పై సందేహాలు తలెత్తడంతో అప్పట్లో వార్తల్లో నిలిచాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకూ వీడ్కోలు
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : టీమిండియా మాజీ లెఫ్మార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకూ వీడ్కోలు
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : టీమిండియా మాజీ లెఫ్మార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా
Published date : 22 Feb 2020 05:46PM