Skip to main content

క్రికెట్‌కు హషీమ్ ఆమ్లా వీడ్కోలు

దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ హషీమ్ మొహమ్మద్ ఆమ్లా ఆటకు వీడ్కోలు పలికాడు.
క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లనుంచి రిటైర్ అవుతున్నట్లు 36 ఏళ్ల ఆమ్లా ఆగస్టు 8న ప్రకటించాడు. అయితే దేశవాళీ క్రికెట్‌కు అందుబాటులో ఉంటానని వెల్లడించాడు. టెస్టు క్రికెట్‌లో పలు ఘనతలను తన ఖాతాలో వేసుకున్న ఆమ్లా వన్డేల్లోనూ తన సత్తా చాటాడు. 2002 అండర్-19 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆమ్లా కోల్‌కతాలో భారత్‌పైనే 2004లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. టెస్టుల్లో దక్షిణాఫ్రికా తరఫున ట్రిపుల్ సెంచరీ (311 నాటౌట్) సాధించిన ఏకైక క్రికెటర్‌గా ఆమ్లా రికార్డు నెలకొల్పాడు.

హషీమ్ ఆమ్లా కెరీర్

మ్యాచ్‌లు

పరుగులు

సగటు

అత్యధిక స్కోరు

100

50

టెస్టులు

124

9282

46.64

311*

28

41

వన్డేలు

181

8113

49.46

159

27

39

టీ20

44

1277

33.60

97*

0

8


క్విక్ రివ్యూ :
ఏమిటి :
క్రికెట్‌కు దక్షిణాఫ్రికా క్రికెటర్ వీడ్కోలు
ఎప్పుడు : ఆగ స్టు 8
ఎవరు : హషీమ్ మొహమ్మద్ ఆమ్లా
Published date : 09 Aug 2019 06:03PM

Photo Stories