Skip to main content

క్రికెట్‌కు బ్రెండన్ మెకల్లమ్ వీడ్కోలు

క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలుకుతున్నట్లు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ ఆగస్టు 6న ప్రకటించాడు.
అంతర్జాతీయ పోటీ క్రికెట్ నుంచి 2016లోనే తప్పుకొన్న అతడు ప్రపంచవ్యాప్తంగా టి20 లీగ్‌లలో ఆడుతున్నాడు. ప్రసుత్తం కెనడాలో జరుగుతున్న గ్లోబల్ టి20 లీగ్‌లో టొరంటో నేషనల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఈ టోర్నీనే తనకు ఆఖరిదని స్పష్టం చేశాడు.
2002లో వన్డే (సిడ్నీలో ఆస్ట్రేలియాపై), 2004లో టెస్టు (హామిల్టన్‌లో దక్షిణాఫ్రికాపై), 2005లో టి20 (ఆక్లాండ్‌లో ఆస్ట్రేలియాపై) మెకల్లమ్ అరంగేట్రం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా అన్ని టి20 లీగ్‌లలో కలిపి 370 మ్యాచ్‌లాడిన మెకల్లమ్ 9,922 పరుగులు చేశాడు.

ఘనతలు..
  • టెస్టుల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ (54 బంతుల్లో) రికార్డు మెకల్లమ్ పేరిటే ఉంది. 2016లో ఆస్ట్రేలియాపై తన చివరి టెస్టులో అతడీ రికార్డు నెలకొల్పాడు.
  • అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్ తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా కూడా మెకల్లమ్ గుర్తింపు పొందాడు.
  • క్రిస్ గేల్ తర్వాత టి20 ఫార్మాట్‌లో సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా ఈ కివీస్ క్రికెటర్ నిలిచాడు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : బ్రెండన్ మెకల్లమ్
Published date : 07 Aug 2019 05:25PM

Photo Stories