క్రికెట్ కు లారా మార్ష్ వీడ్కోలు
Sakshi Education
ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ లారా మార్ష్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
2019, డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై పలికిన 33 ఏళ్ల స్పిన్నర్ తాజాగా దేశవాళీ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలుకుతున్నట్లు ఆగస్టు 13న ట్విట్టర్ ద్వారా తెలిపింది. 2020 ఏడాది జరగాల్సిన ‘100 బంతుల క్రికెట్ టోర్నీ’ అనంతరం గుడ్‌బై చెప్పాలని మొదట భావించినా... కరోనా వల్ల అది కాస్తా వాయిదా పడటంతో ఆమె రిటైర్ అవుతున్నట్లు తెలిపింది.
పేసర్‌గా అరంగేట్రం...
2006లో పేసర్‌గా ఇంగ్లండ్ టెస్టు జట్టులో అరంగేట్రం చేసిన లారా... అనంతరం స్పిన్నర్‌గా మారింది. 2009, 2017 మహిళల వన్డే ప్రపంచ కప్‌లు, 2009లో జరిగిన మహిళల టి20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఇంగ్లండ్ జట్టులో లారా సభ్యురాలు. తన కెరీర్‌లో 9 టెస్టులు, 103 వన్డేలు, 67 టి20ల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆమె మూడు ఫార్మాట్లలో కలిపి 217 వికెట్లను పడగొట్టింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్రికెట్ లోనిఅన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ లారా మార్ష్

Published date : 14 Aug 2020 05:28PM