కరికామ్ సమావేశంలో ప్రధాని మోదీ
Sakshi Education
అమెరికాలోని న్యూయార్క్‌లో సెప్టెంబర్ 25న జరిగిన కరీబియన్ దేశాల సమాఖ్య ‘కరికామ్’ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కరీబియన్ దేశాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు సుమారు రూ.100కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. సౌరశక్తి, ఇతర సంప్రదాయేతర ఇంధన వనరుల పనులకుగాను మరో రూ.1000 కోట్ల రుణాలు కల్పిస్తామన్నారు. కరీబియన్ దేశాలతో ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక సంబంధాలను దృఢం చేసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. గయానాలో ఐటీ రంగంలో ప్రాంతీయ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు, బెలీజ్‌లో ప్రాంతీయ వృత్తి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు మోదీ అంగీకరించినట్లు కరికామ్ ఓ ప్రకటనలో పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరికామ్ శిఖరాగ్ర సమావేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరికామ్ శిఖరాగ్ర సమావేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
Published date : 27 Sep 2019 05:43PM