Skip to main content

క్రెడాయ్‌ ఆవాస్‌ యాప్‌ ఆవిష్కరణ

రియల్టీ సంస్థలు–క్రెడాయ్, నరెడ్కో నివాసిత గృహ ప్రాజెక్టుల మార్కెటింగ్‌ కోసం రూపొందించిన డిజిటల్‌ వేదికలను కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి జూలై 31న ఆవిష్కరించారు.
Current Affairs క్రెడాయ్‌ ఆవాస్‌ యాప్‌తోపాటు.. నరెడ్కో అభివృద్ధి చేసిన ‘హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ డాట్‌ కామ్‌’ పోర్టల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ప్రారంభించారు.

డిజిటలీకరణకు మోడల్‌గా బెంగళూరు
భారత్‌లో డిజిటలీకరణ ప్రక్రియకు బెంగళూరు సరైన నమూనాగా నిలవగలదని సీమెన్స్ ఏజీ సంస్థ జూలై 31న వెల్లడించింది. మొబిలిటీ, అవకాశాలు తదితర అంశాల ప్రాతిపదికన ఈ నగరాన్ని ఎంచుకున్నట్లు ’అట్లాస్‌ ఆఫ్‌ డిజిటలైజేషన్‌’ నివేదికలో వివరించింది. ప్రపంచవ్యాప్తంగా 9 నగరాలు రూపాంతరం చెందిన తీరును నివేదికలో విశ్లేషించింది. బెంగళూరు సహా బెర్లిన్, బ్యూనస్‌ ఎయిర్స్, లండన్, సింగపూర్, దుబాయ్, జొహానెస్‌బర్గ్, లాస్‌ఏంజెలిస్, తైపీ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
క్రెడాయ్‌ ఆవాస్‌ యాప్‌తోపాటు, నరెడ్కో ‘హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ డాట్‌ కామ్‌’ పోర్టల్‌ ఆవిష్కరణ
ఎప్పుడు : జూలై 31
ఎవరు : కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి
ఎందుకు : నివాసిత గృహ ప్రాజెక్టుల మార్కెటింగ్‌ కోసం
Published date : 02 Aug 2020 10:42AM

Photo Stories