Skip to main content

క్రాస్‌బోర్డర్ పెట్రోలియం పైప్‌లైన్ ప్రారంభం

దక్షిణాసియాలోనే తొలి క్రాస్ బోర్డర్ పెట్రోలియం పైప్‌లైన్ భారత్, నేపాల్ మధ్య సెప్టెంబర్ 10న ప్రారంభమైంది.
బిహార్‌లోని మోతిహారి-నేపాల్‌లోని అమ్లేఖ్ గంజ్‌ల మధ్య నిర్మించిన ఈ పెట్రో పైప్‌లైన్‌ను నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. సుమారు 69 కిలోమీటర్ల పొడవునా ఏర్పాటు చేసిన ఈ పైప్‌లైన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.350 కోట్లు వెచ్చించింది. ఈ పైప్‌లైన్ ద్వారా నేపాల్‌కు ఏటా సుమారు 20 లక్షల టన్నుల పెట్రోలియం ఉత్పత్తులు అందనున్నాయి. 1973లోకుదిరిన ఒప్పందం ప్రకారం భారత్ ఇప్పటివరకూ వీటిని ట్రక్కుల ద్వారా నేపాల్‌కు తరలించేది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
క్రాస్‌బోర్డర్ పెట్రోలియం పైప్‌లైన్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బిహార్‌లోని మోతిహారి-నేపాల్‌లోని అమ్లేఖ్ గంజ్‌ల మధ్య
ఎందుకు : నేపాల్‌కు పేట్రోలియం ఉత్పత్తులు సరఫరా చేసేందుకు
Published date : 11 Sep 2019 05:13PM

Photo Stories