Skip to main content

కపిల్ కన్సల్టెన్సీ కంపెనీ ఏపీలోని ఏ జిల్లాలో ఐటీ పార్కును ఏర్పాటు చేయనుంది?

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో కపిల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.500 కోట్ల పెట్టుబడితో ఐటీ పార్కును ఏర్పాటు చేయనుంది.
Current Affairs
ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిని కంపెనీ ప్రతినిధులు కలిసి ప్రాజెక్టు వివరాలను తెలియచేశారు. సుమారు 25 ఎకరాల్లో వాక్‌టు వాక్ కాన్సెప్ట్ (అన్ని సౌకర్యాలు కల్పించే విధానం)తో 80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఐటీ పార్కును అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల సుమారు 8వేల మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ తెలిపింది.

పరిశ్రమలకు కండలేరు నీరు...
చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఏర్పాటు అవుతున్న పరిశ్రమలకు సుమారు రూ.600 కోట్లతో కండలేరు రిజర్వాయర్ నుంచి నీటిని సరఫరా చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్టు మంత్రి మేకపాటి తెలిపారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : రూ.500 కోట్ల పెట్టుబడితో ఐటీ పార్కు ఏర్పాటు
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎవరు : కపిల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
ఎక్కడ : తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
Published date : 30 Sep 2020 05:15PM

Photo Stories