Skip to main content

కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన సంస్థలు?

బ్రిటన్‌కి చెందిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు అభివృద్ధి చేసిన కోవిడ్‌–19 ‘‘కోవిషీల్డ్‌’ వ్యాక్సిన్‌ను సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేస్తుంది.
Current Affairs
కోవిషీల్డ్‌ టీకా డోసు తీసుకున్నవారిలో కొన్ని దుష్ప్రభావాలు తలెత్తుతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఫిర్యాదులు వస్తున్నాయి. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఔషధ నియంత్రణ సంస్థతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. భారత్‌లోనూ కోవిషీల్డ్‌ టీకా తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకట్టడం వంటి ప్రతికూల ప్రభావాలు కనిపించాయి. ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌ఓ డెరైక్టర్‌ జనరల్‌గా టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రేయేసస్‌ ఉన్నారు.

కోవిషీల్డ్‌ టీకాకు మనిషిలో రక్తంలో ప్లేట్‌లెట్లు పడిపోయి గడ్డకట్టడానికి సంబంధం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ(ఈఎంఏ) వెల్లడించింది. అయితే, అత్యంత అరుదుగానే జరుగుతుందని స్పష్టం చేసింది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : కోవిషీల్డ్‌ టీకా డోసు తీసుకున్నవారిలో కొన్ని దుష్ప్రభావాలు
ఎప్పుడు : ఏప్రిల్‌ 9
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
Published date : 10 Apr 2021 06:28PM

Photo Stories