కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ ప్రథమంగా ఏ దేశంలో ప్రారంభమైంది?
Sakshi Education
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధిచేసిన కోవిడ్-19 టీకా ‘‘కోవిషీల్డ్’’ వ్యాక్సినేషన్ ప్రపంచంలోనే ప్రప్రథమంగా జనవరి 4న యూకేలో మొదలైంది.
డయాలసిస్ పేషెంట్లకు ముందుగా ఈ టీకాను ఇస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్‌లో డయాలసిస్ రోగి బ్రియాన్ పింకెర్(82)కు మొదటగా టీకా వేశారు. యూకే ప్రభుత్వం ఇప్పటికే ఫైజర్, బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘‘బీఎన్‌టీ162బీ2(BNT162b2)’’ టీకాకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఫైజర్ టీకా మొదటి డోసును 10 లక్షల మంది ఆరోగ్య సేవల సిబ్బందికి అందజేశారు.
కోవిషీల్డ్: రూ.200-400
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధిచేసిన కోవిడ్ టీకా ‘కోవిషీల్డ్’ను భారత ప్రభుత్వానికి ఒక్కో డోసు 3-4 డాలర్ల చొప్పున, ప్రైవేట్ మార్కెట్లో 6-8 డాలర్ల చొప్పున విక్రయిస్తామని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా చెప్పారు. దేశీయంగా ఆక్స్‌ఫర్డ్ టీకా ఉత్పత్తి, పంపిణీ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ చేపట్టనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కోవిషీల్డ్ వ్యాక్సినేషన్‌ను ప్రథమంగా ప్రారంభించిన దేశం
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : యూకే
ఎక్కడ : యూకే
ఎందుకు : కోవిడ్-19ను నిర్మూలించేందుకు

Published date : 05 Jan 2021 06:07PM