Skip to main content

కోవిడ్‌పై పోరుకు సార్క్ అత్యవసర నిధి ఏర్పాటు

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19(కరోనా వైరస్)పై యుద్ధానికి సార్క్ దేశాలు నడుం బిగించాయి. కరోనాను కట్టడి చేసే దిశగా చర్యలు చేపట్టేందుకు సార్క్ దేశాల నేతలు మార్చి 15న వీడియో కాన్ఫెరెన్స్ లో పాల్గొన్నారు.
Current Affairs కరోనాపై పోరుకు ‘కోవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్’ను ఏర్పాటు చేయాలన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనకు సభ్య దేశాల నేతలు ఏకీభావం తెలిపారు. భారత్ తరఫున ఈ ఫండ్ కోసం కోటి డాలర్లను(రూ.73.95 కోట్లు) మోదీ విరాళంగా ప్రకటించారు. ‘మన దేశాల్లో మొత్తంగా 150 కన్నా తక్కువ కేసులే నమోదయ్యాయి. అరుునా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని హెచ్చరించారు.

వీడియో కాన్ఫెరెన్స్ లో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, భూటాన్ ప్రధాని షెరింగ్, బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా, అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్, పాకిస్తాన్ ప్రధానికి ఆరోగ్య రంగంలో ప్రత్యేక సలహాదారు జాఫర్ మీర్జా పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి
: కోవిడ్‌పై పోరుకు సార్క్ అత్యవసర నిధి ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 15
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : కోవిడ్ 19 విజృంభణ కారణంగా
Published date : 16 Mar 2020 06:46PM

Photo Stories