కోవిడ్ వ్యాక్సిన్ పరీక్షలు ప్రారంభం
Sakshi Education
ప్రాణాంతక కోవిడ్ 19కు విరుగుడుగా అభివృద్ధి చేసిన ఓ టీకాను అమెరికా పరీక్షిస్తోంది. అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ ఆర్థిక సాయంతో ఒక మహిళా వాలంటీర్‌కు మార్చి 16న ప్రయోగాత్మక టీకా వేశారు.
సియాటెల్‌లోని కైసర్ పెర్మనెంటే వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆరోగ్యంగా ఉన్న 45 మంది స్వచ్ఛంద కార్యకర్తలకు ఎన్‌ఐహెచ్, మోడెర్నా అనే కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకాలు ఇస్తాయి. అన్నీ సవ్యంగా సాగి ఈ పరీక్షలు విజయవంతమైతే అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు మరో ఏడాదిన్నర సమయం పట్టే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.
జాతీయ అత్యవసర పరిస్థితి విధింపు
కోవిడ్ 19(కరోనా వైరస్) విసృ్తతి నేపథ్యంలో అమెరికాలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు మార్చి 14న ప్రకటించారు. అత్యవసర పరిస్థితి ప్రకటించిన నేపథ్యంలో వ్యాధి నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిధులు సుమారు 3.6 లక్షల కోట్ల రూపాయలు అందుబాటులోకి రానున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కోవిడ్ 19 వ్యాక్సిన్ పరీక్షలు ప్రారంభం
ఎప్పుడు : మార్చి 16
ఎవరు : అమెరికా

Published date : 17 Mar 2020 08:49PM