కోవిడ్ వారియర్ల క్రాష్ కోర్సును ఏ పథకంలో భాగంగా రూపొందించారు?
Sakshi Education
దేశవ్యాప్తంగా దాదాపు లక్షకు పైగా కోవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్లు నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఉద్దేశించిన స్వల్పకాలిక కోర్సు ప్రారంభమైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కోవిడ్ వారియర్ల క్రాష్ కోర్సు ప్రారంభం
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : దేశవ్యాప్తంగా 111 సెంటర్లలో...
ఎందుకు : దేశవ్యాప్తంగా దాదాపు లక్షకు పైగా కోవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్లు నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు
ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 18న ఈ కోర్సును ప్రారంభించారు. భవిష్యత్‌లో కరోనాతో రానున్న సవాళ్లను ఎదుర్కొనే సంసిద్ధతను పెంచుకునే దిశగా ఈ కోర్సు రూపొందిందని ప్రధాని తెలిపారు.
కోర్సు వివరాలు...
కోర్సు వివరాలు...
- హోం కేర్ సపోర్ట్, బేసిక్ కేర్ సపోర్ట్, అడ్వాన్స్‌డ్ కేర్ సపోర్ట్, ఎమర్జెన్సీ కేర్ సపోర్ట్, శాంపిల్ కలెక్షన్ సపోర్ట్, మెడకల్ ఎక్విప్‌మెంట్ సపోర్ట్.. అనే 6 కీలక విధుల్లోని వారియర్లకు ఉపయోగపడేలా దీనిని రూపొందించారు.
- దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 111 సెంటర్లలో ఈ కోర్సును ప్రారంభించారు.
- ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0లో భాగంగా రూ. 276 కోట్లతో ఈ ప్రత్యేక కోర్సును రూపొందించారు.
- ఆరోగ్య రంగంలో మానవ వనరుల ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను తీర్చేలా ఈ కోర్సు రూపొందింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కోవిడ్ వారియర్ల క్రాష్ కోర్సు ప్రారంభం
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : దేశవ్యాప్తంగా 111 సెంటర్లలో...
ఎందుకు : దేశవ్యాప్తంగా దాదాపు లక్షకు పైగా కోవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్లు నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు
Published date : 19 Jun 2021 06:47PM