Skip to main content

కోవిడ్‌ కవచ్‌ ఎలిసా పేరుతో దేశీయంగా మొదటి ‌కిట్

పుణేకు చెందిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ దేశీయంగా మొదటి కోవిడ్‌–19 యాంటీబాడీ టెస్ట్‌కిట్‌ను రూపొందించిందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ మే 10న తెలిపారు.

Current Affairsఐసీఎంఆర్‌ భాగస్వామ్యంతో రూపొందించిన దీనికి ‘కోవిడ్‌ కవచ్‌ ఎలిసా’ అని పేరు పెట్టారు. ఇది కరోనాపై పోరాటంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశం కోవి డ్‌–19పై పోరులో విజయం సాధించబోతోందని మంత్రి పేర్కొన్నారు.

కొత్త కేసులు 3,277
దేశంలో 24 గంటల్లో కరోనా మహమ్మారికి మరో 128 మంది బలికాగా, 3,277 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 62,939కు, మృతుల సంఖ్య 2,109కు చేరిందని మే 10న కేంద్రం తెలిపింది. 19,357 మంది కోలుకున్నారనీ, రికవరీ రేటు 30.75 శాతంగా ఉందని పేర్కొంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : కోవిడ్‌ కవచ్‌ ఎలిసా పేరుతో మొదటి కోవిడ్‌–19 యాంటీబాడీ టెస్ట్‌కిట్‌ రూప‌క‌ల్పన‌
ఎప్పుడు : మే 10
ఎవరు : నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ, ఐసీఎంఆర్‌ 
ఎక్కడ : భార‌త్
ఎందుకు : క‌రోనాను ఎదుర్కొనేందుకు
Published date : 11 May 2020 06:09PM

Photo Stories