కోవిడ్ కట్టడికి నైపర్ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ పేరు?
Sakshi Education
కోవిడ్-19 వైరస్‌తోపాటు అన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్లనూ సమర్థంగా నియంత్రించే ‘లైఫ్ వైరో ట్రీట్’ అనే వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లు హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్) సంస్థ వెల్లడించింది.
నైపర్, లైఫ్ ఆక్టివ్‌స, సుప్రీం ఇండస్ట్రీస్ సంయుక్త ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను సెప్టెంబర్ 11న విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. అనంతరం నైపర్ డెరైక్టర్ డా.శశిబాలాసింగ్ మాట్లాడుతూ... ఈ వ్యాక్సిన్‌తో ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు అయినా నియంత్రణలోకి వస్తాయని తెలిపారు. వైరల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన క్రిములు కేవలం 3 రోజుల్లో శరీరం నుంచి తొలగిపోతాయని వివరించారు. ఈ మందును ముందు జాగ్రత్త చర్యగా ప్రివెంటివ్ మెడిసిన్‌గానూ వాడవచ్చని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : లైఫ్ వైరో ట్రీట్ పేరుతో వ్యాక్సిన్ రూపకల్పన
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్) సంస్థ
ఎందుకు : కోవిడ్-19 నివారణకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : లైఫ్ వైరో ట్రీట్ పేరుతో వ్యాక్సిన్ రూపకల్పన
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్) సంస్థ
ఎందుకు : కోవిడ్-19 నివారణకు
Published date : 12 Sep 2020 05:14PM