Skip to main content

కోవిడ్ బారిన మాజీ ప్రధాని దంపతులు

జేడీఎస్ అధినేత, భారతదేశవ మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, ఆయన సతీమణి చెన్నమ్మకు మార్చి 31న పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలింది.
Current Affairs
వారిద్దరూ బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో కరోనా రెండో దశ ఉధృతంగా ఉంది.

కోవిషీల్డ్‌ షెల్ఫ్‌లైఫ్‌ ఇక 9 నెలలు...
ఆక్స్‌ఫర్డ్‌–ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్‌ టీకా ‘కోవిషీల్డ్‌’ ప్రస్తుతం ఉన్న షెల్ఫ్‌లైఫ్‌ను డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) 6 నెలల నుంచి తాజాగా 9 నెలలకు పెంచింది. ఉత్పత్తి తేదీ నుంచి కాలంచెల్లే తేదీ వరకు ఉన్న గడువును షెల్ఫ్‌లైఫ్‌ అంటారు. ఈ టీకాను భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే.

దేవెగౌడ ఏ సమయంలో భారత ప్రధానిగా ఉన్నారు?
భారత ప్రధాన మంత్రులు

వ్యక్తి

కాలం

1. జవహర్‌లాల్ నెహ్రూ

15.08.1947 - 27.05.1964

2. గుల్జారీ లాల్ నందా

27.05.1964 - 09.06.1964 (ఆపద్ధర్మ)

3. లాల్ బహదూర్ శాస్త్రి

09.06.1964 - 11.01.1966

4. గుల్జారీ లాల్ నందా

11.01.1966 - 24.01.1966 (ఆపద్ధర్మ)

5. ఇందిరా గాంధీ

24.01.1966 - 24.03.1977

6. మొరార్జీ దేశాయ్

24.03.1977 - 28.07.1979

7. చరణ్ సింగ్

28.07.1979 - 14.01.1980

8. ఇందిరా గాంధీ

14.01.1980 - 31.10.1984

9. రాజీవ్ గాంధీ

31.10.1984 - 02.12.1989

10. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్

02.12.1989 - 10.11.1990

11. చంద్రశేఖర్

10.11.1990 - 21.06.1991

12. పి.వి.నరసింహారావు

21.06.1991 - 16.05.1996

13. అటల్ బిహారీ వాజ్‌పేయి

16.05.1996 - 01.06.1996

14. హెచ్.డి.దేవెగౌడ

01.06.1996 - 21.04.1997

15. ఇందర్ కుమార్ గుజ్రాల్

21.04.1997 - 19.03.1998

16. అటల్ బిహారీ వాజ్‌పేయి

19.03.1998 - 22.05.2004

18. మన్మోహన్ సింగ్

22.05.2004 - 22.05.2009

19. మన్మోహన్ సింగ్

22.05.2009 - 26.05.2014

20. నరేంద్ర మోదీ

26.05.2014 - 30.05.2019

21. నరేంద్ర మోదీ

30.05.2019 నుంచి...
Published date : 01 Apr 2021 06:31PM

Photo Stories