కోవిడ్-19తో ప్రపంచ వ్యాప్తంగా ఆహార సంక్షోభం
Sakshi Education
కోవిడ్-19 సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోకపోతే ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం నెలకొనే అవకాశముందని మూడు అంతర్జాతీయ సంస్థల అధిపతులు హెచ్చరించారు.
ఈ మేరకు ఏప్రిల్ 1న ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏవో) అధిపతి క్యూ డొంగ్యూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అధ్యక్షుడు టెడ్రోస్ అధనోమ్, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) డైరెక్టర్ రాబెర్టో అజెవెడోలు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆహార లభ్యతపై ఏర్పడుతోన్న సందిగ్ధత అంతర్జాతీయ ఎగుమతులపై ఆంక్షలకు కారణమౌతోంది, ఇది ప్రపంచ మార్కెట్‌లో ఆహార కొరతకు దారితీస్తోందని పేర్కొన్నారు.
Published date : 02 Apr 2020 03:13PM