కోవిడ్–19 వేరియంట్ డెల్టాను తొలుత ఎక్కడ గుర్తించారు?
Sakshi Education
భారత్‌లో మొట్టమొదటిసారిగా గుర్తించిన కోవిడ్–19 వేరియంట్ ‘డెల్టా’ను ఆందోళనకరమైన వేరియంట్‌గా అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (యూఎస్ సీడీసీ) ప్రకటించింది.
‘‘అమెరికాలో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న బి.1.1.7.(ఆల్ఫా), బి.1.351(బీటా), పి.1(గామా), బి.1.427 (ఎప్సిలన్), బి.1.429(ఎప్సిలన్), బి.1.617.2 (డెల్టా) వేరియంట్లను ఆందోళనకరమైనవిగా గుర్తిస్తున్నాం. అయితే, అత్యంత ప్రభావం చూపే వేరియంట్లను అమెరికాలో ఇప్పటి వరకు గుర్తించలేదు’’ అని సీడీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. జూన్ 5వ తేదీ నాటికి దేశంలో నమోదైన కోవిడ్ కేసుల్లో 9.9 శాతం డెల్టా వేరియంట్‌వేనని తెలిపింది. డెల్టాను ఆందోళనకర వేరియంట్‌గా మే 10వ తేదీనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆందోళనకరమైన కోవిడ్–19 వేరియంట్‌గా బి.1.617.2 (డెల్టా) కు గుర్తింపు
ఎప్పుడు : జూన్ 17
ఎవరు : అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (యూఎస్ సీడీసీ)
ఎక్కడ : అమెరికా
ఎందుకు : బి.1.617.2 (డెల్టా) అధిక ప్రభావం చూపిస్తుండటంతో...

Published date : 18 Jun 2021 06:05PM