Skip to main content

కోవిడ్-19 ఫండ్‌కు పాక్ 3 మిలియన్ డాలర్ల విరాళం

సార్క్ కోవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్‌కు పాకిస్తాన్‌ ప్రభుత్వం మూడు మిలియన్ డాలర్లు(రూ.22.81కోట్లు) విరాళం ప్రకటించింది.
Current Affairs
ఈ మేరకు ఏప్రిల్ 9న పాక్‌ విదేశాంగ శాఖ ప్రక‌టించింది. ఈ నిధులకు సంబంధించిన అన్ని ప్రక్రియలు సార్క్‌ కార్యదర్శి నియంత్రణలోనే ఉండాలని తెలిపింది. అలాగే, నిధుల వినియోగం విషయంలో అన్ని సభ్యదేశాలను సంప్రదించి.. విస్తృతంగా చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోరింది. కరోనాపై పోరుకు సార్క్ దేశాలు ‘కోవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్’ను ఏర్పాటు చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. భారత్ తరఫున ఈ ఫండ్ కోసం కోటి డాలర్లను(రూ.73.95 కోట్లు) మోదీ విరాళంగా ప్రకటించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : కోవిడ్-19 ఫండ్‌కు 3 మిలియన్ డాలర్ల విరాళం
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : పాకిస్తాన్‌ ప్రభుత్వం
ఎందుకు : కరోనాపై పోరుకు
Published date : 10 Apr 2020 06:33PM

Photo Stories