కోవాక్స్‌తో ఒప్పందం చేసుకున్న భారత ఫార్మా సంస్థ?
Sakshi Education
యునెటైడ్ బయోమెడికల్‌కు చెందిన కోవాక్స్(అమెరికా)తో ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్ సంస్థ అరబిందో ఫార్మా.. ప్రత్యేక లెసైన్సింగ్ ఒప్పందం చేసుకుంది.
ఒప్పందంలో భాగంగా కోవిడ్-19 చికిత్సకై కోవాక్స్ తయారు చేసిన తొలి మల్టీటోప్ పెప్టైడ్ ఆధారిత వ్యాక్సిన్ ‘‘యూబీ-612’’ అభివృద్ధి, ఉత్పత్తి, విక్రయాలను అరబిందో చేపడుతుంది. భారత్‌తోపాటు యునిసెఫ్‌కు ఈ వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తారు. కోవాక్స్ ప్రస్తుతం యూబీ-612 వ్యాక్సిన్ క్యాండిడేట్ తొలి దశ ఔషధ ప్రయోగాలను నిర్వహిస్తోంది.
ఎల్ అండ్ టీ 3డీ బిల్డింగ్...
ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) కన్‌స్ట్రక్షన్ తాజాగా 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో భవంతిని నిర్మించింది. దేశీయంగా ఇలాంటి నిర్మాణం ఇదే మొదటిదని కంపెనీ వెల్లడించింది. తమిళనాడులోని కాంచీపురంలోని తమ ప్లాంటులో జీప్లస్1 (గ్రౌండ్ ప్లస్ వన్) స్వరూపంలో ఈ భవంతిని రూపొందించినట్లు వివరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యునెటైడ్ బయోమెడికల్‌కు చెందిన కోవాక్స్(అమెరికా)తో ఒప్పందం
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : హైదరాబాద్ సంస్థ అరబిందో ఫార్మా
ఎందుకు : యూబీ-612 వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి, విక్రయాల కోసం

Published date : 25 Dec 2020 06:01PM