Skip to main content

కోవాగ్జిన్‌కు మరోసారి చుక్కెదురు!

భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌కు మరోసారి చుక్కెదురైంది. కోవాగ్జిన్‌కు పూర్తి స్థాయి లైసెన్స్ ఇచ్చేందుకు డీసీజీఐ అంగీకరించలేదు.
Current Affairsమరింత క్లినికల్‌ ట్రయల్స్‌ డేటా కావాలని భారత్‌ భారత్ బయోటెక్‌కు డీసీజీఐ తెలిపినట్లు సమాచారం. దీంతో ఫుల్‌లైసెన్స్‌ పర్మిషన్‌ ఇచ్చేందుకు మరో ఏడాది సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా కోవాగ్జిన్‌ను గర్బిణీలకు వాడొద్దని డీసీజీఐ తెలిపింది.

ఇక ప్రస్తుతం అత్యవసర వినియోగం కింద కోవాగ్జిన్‌ వినియోగిస్తున్నారు. ​కాగా, తాజాగా 77.8శాతం సమర్ధత ఉందంటూ డీసీజీఐకి కోవాగ్జిన్‌ డేటా ఇచ్చింది. మూడో దశ ప్రయోగాలను 25,800 మందిపై చేసిన భారత్‌ బయోటెక్‌ సంస్థ తన డేటాను డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి కోసం పంపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై ఇప్పటి వరకు భారత్‌ బయోటెక్ స్పందించలేదు. ఇప్పటికే అమెరికాలో కోవాగ్జిన్‌ సరఫరాకు యూఎప్‌ఎఫ్‌డీఏ అంగీకరించని సంగతి తెలిసిందే.
Published date : 24 Jun 2021 06:23PM

Photo Stories