కోర్టు తీర్పుల ఆర్థిక ప్రభావాలపై అధ్యయనం చేయనున్న సంస్థ?
Sakshi Education
సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఇచ్చే ఉత్తర్వులు పాటించడం వల్ల ఆర్థికంగా పడే ప్రభావాలపై అధ్యయనం చేయాలని నీతి ఆయోగ్ నిర్ణయించింది.
ఈ అధ్యయన బాధ్యతలను జైపూర్‌కి చెందిన ‘సీయూటీఎస్ ఇంటర్నేషనల్’కు అప్పగించింది. అధ్యయనం కోసం అయిదు కేసులు ఎంపికయ్యాయి. గోవాలో మోపా విమానాశ్రయంపై చర్చల నిలిపివేత, తమిళనాడులోని ట్యుటికోరిన్‌లో స్టెరిలైట్ కాపర్ ప్లాంటు మూసివేత, ఢిల్లీ రాజధాని ప్రాంతంలో నిర్మాణ కార్యకలాపాల నిలిపివేత వంటివి ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా డాక్టర్ రాజీవ్ కుమార్ ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కోర్టు తీర్పుల ఆర్థిక ప్రభావాలపై అధ్యయనం
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : సీయూటీఎస్ ఇంటర్నేషనల్
ఎందుకు : సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఇచ్చే ఉత్తర్వులు పాటించడం వల్ల ఆర్థికంగా పడే ప్రభావాలపై అధ్యయనం చేసేందుకు

Published date : 11 Feb 2021 05:54PM