Skip to main content

కోపర్తిలో ఎలక్టాన్రిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్

వైఎస్సార్ జిల్లా కోపర్తిలో ‘వైఎస్సార్ ఎలక్టాన్రిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (వైఎస్సార్ ఈఎంసీ)’ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 500 ఎకరాల్లో ఈ క్లస్టర్ ఏర్పాటుకు అనుమతులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 26న ఉత్తర్వులు జారీ చేసింది.
Edu newsకేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈఎంసీ-2 విధానం కింద ఎలక్టాన్రిక్ తయారీదారులను ఆకర్షించేందుకు రూ.730.50 కోట్ల పెట్టుబడితో వైఎస్సార్ ఈఎంసీని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. కరికల్ వలవన్ పేర్కొన్నారు.

గ్రాంట్‌గా రూ.380.50 కోట్లు...
వైఎస్సార్ ఈఎంసీ ఏర్పాటుకు కేంద్ర ఎలక్టాన్రిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ రూ.380.50 కోట్లు గ్రాంట్‌గా సమకూర్చనుంది. మిగిలిన రూ.350 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఆటోమోటివ్ ఎలక్టాన్రిక్స్, ఇండస్టియ్రల్ ఎలక్టాన్రిక్స్, కన్జ్యూమర్ ఎలక్టాన్రిక్స్, మెడికల్ ఎలక్టాన్రిక్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్, టెలికాం నెట్‌వర్కింగ్, కమ్యూనికేషన్, ఈ మొబిలిటీ ఉత్పత్తుల తయారీకి చెందిన పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఏపీఐఐసీ ఈ ఈఎంసీని అభివృద్ధి చేయనుంది. ఈ క్లస్టర్ ద్వారా రూ.పదివేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
వైఎస్సార్ ఎలక్టాన్రిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (వైఎస్సార్ ఈఎంసీ)ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : కోపర్తి, వైఎస్సార్ జిల్లా
ఎందుకు : రూ.పదివేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని
Published date : 29 Aug 2020 12:06PM

Photo Stories