Skip to main content

కోల్ చెవాంగ్ రించేన్ వంతెన ప్రారంభం

జమ్మూకశ్మీర్‌లో శ్యోక్ నది సమీపంలోని తూర్పు లదాఖ్‌లో నిర్మించిన 1,400 అడుగుల కోల్ చెవాంగ్ రించేన్ వంతెనను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అక్టోబర్ 21న ప్రారంభించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ... సరిహద్దుల వద్ద చొరబాట్లకు భారత ఆర్మీ పాకిస్తాన్‌కు తగిన సమాధానం చెప్పిందని అన్నారు. పాక్ చొరబాట్లను ఆపని పక్షంలో ఇలాంటి చర్యలే కొనసాగుతాయని హెచ్చరించారు. భారతదేశ సమగ్రతను అస్థిరపరచడానికి, బలహీనపరచడానికి పాక్ ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
కోల్ చెవాంగ్ రించేన్ వంతెన ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఎక్కడ : శ్యోక్ నది సమీపం, తూర్పు లదాఖ్, జమ్మూకశ్మీర్
Published date : 22 Oct 2019 05:22PM

Photo Stories