Skip to main content

కోజికోడ్-ఐఐఎంలో ఇండియన్ థాట్ సదస్సు

కేరళలోని కోజికోడ్-ఐఐఎంలో ‘గ్లోబలైజింగ్ ఇండియన్ థాట్’ పేరుతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 16న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
Current Affairsసదస్సును ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ...  విశ్వవ్యాప్తమైన హింస, ద్వేషం, ఉగ్రవాదం, ఘర్షణల నుంచి విముక్తి కోరుకునే ప్రపంచ దేశాలకు భారతీయ జీవన విధానం ఒక ఆశారేఖ అని అభివర్ణించారు. శాంతి, సామరస్యపూర్వక జీవన విధానం కారణంగానే భారతీయ నాగరికత వర్ధిల్లిందన్నారు. బల ప్రదర్శన ద్వారా కాకుండా, శాంతి చర్చల ద్వారానే ఘర్షణలను నిరోధించగలమన్నది భారతీయుల విధానమన్నారు. ఈ సందర్భంగా ఐఐఎం క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు.

 క్విక్ రివ్యూ   :
 ఏమిటి
 : గ్లోబలైజింగ్ ఇండియన్ థాట్ పేరుతో సదస్సు ప్రారంభం
 ఎప్పుడు  : జనవరి 16
 ఎవరు  : ప్రధాని నరేంద్ర మోదీ
 ఎక్కడ  : కోజికోడ్-ఐఐఎం, కేరళ

మాదిరి ప్రశ్నలు

1. ప్రస్తుతం కేరళ రాష్ట్ర గవర్నర్‌గా ఎవరు ఉన్నారు?
 1. లాల్జీ టాండన్ 
 2. భగత్‌సింగ్ కోశ్యారీ
 3. నజ్మా హెప్తుల్లా 
 4. అరిఫ్ మహ్మద్ ఖాన్

Published date : 17 Jan 2020 06:08PM

Photo Stories