కొలువుదీరిన ఆంధ్రప్రదేశ్ కొత్త హైకోర్టు
Sakshi Education
అమరావతిలో ఆంధ్రప్రదేశ్ కొత్త హైకోర్టు జనవరి 1న కొలువుదీరింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ హైకోర్టును ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నూతన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు మరో 13 మంది న్యాయమూర్తులతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
1961, ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ జన్మించారు. ఆయన తండ్రి సి.పద్మనాభరెడ్డి ప్రముఖ క్రిమినల్ లాయర్, గొప్ప మానవతావాదిగా గుర్తింపు పొందారు. నిజాం కాలేజీలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన ప్రవీణ్‌కుమార్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1986 ఫిబ్రవరి 28న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 2012, జూన్ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2013, డిసెంబర్ 4న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కొలువుదీరిన ఆంధ్రప్రదేశ్ కొత్త హైకోర్టు
ఎప్పుడు : జనవరి 1
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్

Published date : 02 Jan 2019 05:46PM