కొలోన్ బాక్సింగ్ లో మీనాకు స్వర్ణం
Sakshi Education
కొలోన్ ప్రపంచ కప్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్ మైస్నమ్ మీనా కుమారికి స్వర్ణ పతకం లభించింది.
జర్మనీలోని కొలోన్‌లో ఏప్రిల్ 13న జరిగిన మహిళల 54 కేజీల విభాగం ఫైనల్లో మచాయ్ బున్‌యానట్ (థాయ్‌లాండ్)పై మీనా విజయం సాధించింది. మరోవైపు భారత్‌కే చెందిన సాక్షి (57 కేజీలు), పిలావో బాసుమతారి (64 కేజీలు) రజతాలతో సరిపెట్టుకున్నారు. ఫైనల్లో మికేలా వాల్ష్ (ఐర్లాండ్) చేతిలో సాక్షి... చెంగ్యూ యాంగ్ (చైనా) చేతిలో బాసుమతారి ఓడిపోయారు. పింకీ రాణి (51 కేజీలు), పర్వీన్ (60 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గారు. ఈ టోర్నీలో భారత్ మొత్తం 5 (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పతకాలను సాధించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కొలోన్ ప్రపంచ కప్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు స్వర్ణం
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎవరు : మెస్నమ్ మీనా కుమారి
ఎక్కడ : కొలోన్, జర్మనీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : కొలోన్ ప్రపంచ కప్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు స్వర్ణం
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎవరు : మెస్నమ్ మీనా కుమారి
ఎక్కడ : కొలోన్, జర్మనీ
Published date : 15 Apr 2019 05:43PM