కొలంబియాతో సరిహద్దులను తెరిచిన వెనిజులా
Sakshi Education
కొలంబియాతో ఉన్న సరిహద్దులను పాక్షికంగా తెరుస్తున్నట్లు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో జూన్ 7న ప్రకటించారు.
అమెరికా సామ్రాజ్యవాదం మానవతా సాయం పేరుతో సరిహద్దు గుండా ప్రతిపక్షాలకు ఆయుధాలను గుట్టుగా చేరవేసేందుకు పథకం వేసిందని వెనిజులా భావించింది. దీంతో కొలంబియా, బ్రెజిల్, డచ్ యాంటిల్లిస్ దీవులతో వెనిజులాకు ఉన్న సరిహద్దులను 2019, ఫిబ్రవరిలో మదురో ప్రభుత్వం మూసివేసింది. పరిస్థితి మెరుగుపడడంతో బ్రెజిల్, అరుబా ఐలండ్‌లతో ఉన్న సరిహద్దులను ఇంతకుముందే తెరిచింది. ఇప్పుడు పశ్చిమ రాష్ట్రమైన తచిరాతో ఉన్న కొలంబియా సరిహద్దులను కూడా తెరవాలని నిర్ణయించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కొలంబియాతో సరిహద్దులను తెరిచిన వెనిజులా
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో
ఎక్కడ : తచిరా రాష్ట్రం, వెనిజులా
క్విక్ రివ్యూ :
ఏమిటి : కొలంబియాతో సరిహద్దులను తెరిచిన వెనిజులా
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో
ఎక్కడ : తచిరా రాష్ట్రం, వెనిజులా
Published date : 10 Jun 2019 06:14PM