కొలీజియంలోకి ఎల్. నాగేశ్వరరావు
Sakshi Education
నారిమన్ పదవీ విరమణతో సుప్రీంకోర్టు కొలీజియంలో ఖాళీ ఏర్పడనుంది.
భారత ప్రధాన నాయ్యమూర్తితో పాటు సుప్రీంకోర్టులోని మరో నలుగురు అత్యంత సీనియర్ జడ్జీలు కొలీజియంలో ఉంటారు. సుప్రీంకోర్టులు, హైకోర్టుల్లో జడ్జిల నియామకానికి సంబంధించి కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులు చేస్తుంది. నారిమన్ పదవీ విమరణతో సీనియారిటీ జాబితాలో తదుపరి స్థానంలో (ఆరో స్థానంలో) ఉన్న తెలుగువాడైన జస్టిస్ లావు నాగేశ్వరరావు శుక్రవారం కొలీజియంలో చేరనున్నారు. 2022 జూన్ 6న పదవీవిరమణ చేసేదాకా ఆయన కొలీజియంలో కొనసాగుతారు. నారిమన్ రిటైర్ కావడంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 25కు పడిపోయింది. తొమ్మిది ఖాళీలున్నాయి.
Published date : 14 Aug 2021 11:51AM