కంపెనీల చట్టం సవరణకు కేబినెట్ ఆమోదం
Sakshi Education
దేశీ కంపెనీలు విదేశీ ఎక్స్చేంజీల్లో నేరుగా లిస్టయ్యే ప్రతిపాదనకు కేంద్రప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.
ఇందుకు అనుగుణంగా కంపెనీల చట్టం, 2013కి సవరణలు చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మార్చి 4న జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మొత్తంగా కంపెనీల చట్టంలో 72 సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కొన్ని భారతీయ సంస్థల షేర్లు విదేశీ ఎక్స్చేంజీల్లో ట్రేడవుతున్నప్పటికీ.. అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్), గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) రూపంలో లిస్టయి ఉంటున్నాయి.
పెట్టుబడులకు ఆస్కారం...
నేరుగా విదేశాల్లో లిస్టింగ్ అవకాశం లభించిన పక్షంలో ఆయా సంస్థలు విసృ్తత స్థాయిలో నిధులు సమీకరించుకునేందుకు మరిన్ని మార్గాలు లభించడంతో పాటు.. దేశంలోకి మరింతగా పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉండగలదని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కంపెనీల చట్టం, 2013కి సవరణలు
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : దేశీ కంపెనీలు విదేశీ ఎక్స్చేంజీల్లో నేరుగా లిస్టయ్యేందుకు వీలు కల్పించేందుకు

Published date : 05 Mar 2020 06:00PM