Skip to main content

కల్నల్‌ సంతోష్‌బాబు కాంస్య విగ్రహాన్ని ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు?

2020 ఏడాది దేశ సరిహద్దులోని గాల్వాన్‌ లోయలో చైనా ఆర్మీకి, మన ఆర్మీకి జరిగిన గొడవల్లో వీరమరణం పొందిన కల్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌బాబు కాంస్య విగ్రహాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేశారు.
Current Affairs తెలంగాణ ఇంధన శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు జూన్‌ 15న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కోర్టు చౌరస్తాకు కల్నల్‌ సంతోష్‌బాబు చౌరస్తాగా నామకరణం చేశారు.

2020 జూన్‌ 15న...
2020 జూన్‌ 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో పాయింట్‌ 14 వద్ద యుద్ధాన్ని తలపించిన భారత్‌–చైనా సైనికుల ఘర్షణలో కల్నల్‌ సంతోష్‌బాబు సహా 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయి ఏడాది పూర్తయింది. వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌ బాబును భారత ప్రభుత్వం మహావీర్‌ చక్రతో గౌరవించింది. సైనికుల త్యాగాలను స్మరిస్తూ జూన్‌ 15న êరత సైన్యం ఘన నివాళులర్పించింది. లేహ్‌ యుద్ధస్మారకం వద్ద 14 కోర్‌ దళం నివాళులర్పించింది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : కల్నల్‌ సంతోష్‌బాబు కాంస్య విగ్రహావిష్కరణ
ఎప్పుడు : జూన్‌ 15
ఎవరు : తెలంగాణ మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి
ఎక్కడ : సూర్యాపేట జిల్లా కేంద్రం, తెలంగాణ
Published date : 16 Jun 2021 07:34PM

Photo Stories