Skip to main content

కలంకారీ కళాకారుడు,పద్మశ్రీ అవార్డీ కన్నుమూత

ప్రముఖ కలంకారీ కళాకారుడు, రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత జొన్నలగడ్డ గుర్రప్పశెట్టి(75) కన్నుమూశారు.
Current Affairs
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 14న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కలంకారీలో విశిష్ట నైపుణ్యాలు ప్రదర్శించడంతో 2008లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతులమీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. శ్రీకాళహస్తిలో కలంకారీ వృత్తిని మెరుగుపరిచి పలువురిని జాతీయ స్థాయి కలంకారీ కళాకారులుగా తీర్చిదిద్దారు. భారతరత్న మాల, భాగవత మాల, వ్రత పని(కలంకారీ) పుస్తకాలను ఆయన రచించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ప్రముఖ కలంకారీ కళాకారుడు, రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : జొన్నలగడ్డ గుర్రప్పశెట్టి(75)
ఎక్కడ : శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా
ఎందుకు : అనారోగ్యం కారణంగా

 

Published date : 17 Feb 2021 06:03PM

Photo Stories