Skip to main content

కలకత్తా హైకోర్టుకు రాధాకృష్ణన్ బదిలీ

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయించింది.
ఈ మేరకు జనవరి 11న కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇప్పటి వరకు కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన డీకే గుప్తా ఇటీవల పదవీ విరమణ చేయడంతో కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. కేరళకు చెందిన జస్టిస్ రాధాకృష్ణన్ 2018, జూలై 1న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై వచ్చారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : కలకత్తా హైకోర్టుకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్
Published date : 12 Jan 2019 06:11PM

Photo Stories