కళింగ విద్యాసంస్థల్లో ప్రపంచ కవుల సమ్మేళనం
Sakshi Education
భువనేశ్వర్‌లోని కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ(కేఐఐటీ), కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్(కేఐఎస్‌ఎస్)లో 39వ ప్రపంచ కవుల సమ్మేళనం (వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ పోయెట్స్-డబ్ల్యూసీపీ)ను నిర్వహించనున్నారు.
కోల్‌కతాలో జనవరి20న జరిగిన సమావేశంలో డబ్ల్యూసీపీ అధ్యక్షుడు, కేఐఐటీ, కేఐఎస్‌ఎస్‌ల వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ అచ్యుత సమంత ఈ విషయం వెల్లడించారు. 2019, అక్టోబర్‌లో జరిగే ఈ సమ్మేళనంలో దాదాపు 100 దేశాలకు చెందిన 500 మందికిపైగా కవులు, రచయితలతోపాటు నోబెల్ పురస్కార గ్రహీతలు పాల్గొననున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 39వ ప్రపంచ కవుల సమ్మేళనం
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : ప్రొఫెసర్ అచ్యుత సమంత
ఎక్కడ : కళింగ విద్యాసంస్థలు, భువనేశ్వర్, ఒడిశా
క్విక్ రివ్యూ :
ఏమిటి : 39వ ప్రపంచ కవుల సమ్మేళనం
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : ప్రొఫెసర్ అచ్యుత సమంత
ఎక్కడ : కళింగ విద్యాసంస్థలు, భువనేశ్వర్, ఒడిశా
Published date : 22 Jan 2019 05:23PM