Skip to main content

కలాం తపాల స్టాంపులు ఆవిష్కరణ

హైదరాబాద్‌లోని భారత డైనమిక్ లిమిటెడ్ (బీడీఎల్)లో ఆగస్టు 2న నిర్వహించిన ఆ సంస్థ స్వర్ణ జయంతి ఉత్సవాల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీడీఎల్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి, దివంగత నేత అబ్దుల్ కలాం విగ్రహంతోపాటుగా కలాం తపాల స్టాంపులు, మిస్సైల్ నమూనాలను మంత్రి ఆవిష్కరించారు. అలాగే ఇబ్రహీంపట్నంలోని జలనిధిని ఇక్కడ్నుంచే రిమోట్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. దేశంలో బీడీఎల్ అతి పెద్ద రక్షణ సంస్థ అని, అబ్దుల్ కలాం ప్రేరణతోనే ఈ రక్షణ సంస్థ సాధ్యమైందని వివరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అబ్దుల్ కలాం తపాల స్టాంపులు ఆవిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
ఎక్కడ : భారత డైనమిక్ లిమిటెడ్ (బీడీఎల్), హైదరాబాద్
Published date : 05 Aug 2019 05:51PM

Photo Stories