కియా తొలి కారు సెల్టోస్ ఆవిష్కరణ
Sakshi Education
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ తాజాగా భారత్‌లో తమ తొలి కారు ’సెల్టోస్’ను ఆవిష్కరించింది.
అనంతపురంలోని కియా ప్లాంటులో ఆగస్టు 8న జరిగిన కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్ రోజా, భారత్‌లో దక్షిణ కొరియా రాయబారి షిన్ బాంగ్-కిల్, కియా మోటార్స్ ఇండియా ఎండీ కూక్ హున్ షిమ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సెల్టోస్ కారును ఆవిష్కరించారు.
536 ఎకరాల్లో ప్లాంటు ..
అనంతపురం జిల్లా పెనుగొండలో సుమారు 536 ఎకరాల్లో కియా ప్లాంటు ఏర్పాటైంది. వార్షికంగా దీని ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షల కార్లు కాగా, భవిష్యత్‌లో 7 లక్షల యూనిట్లకు కియా పెంచుకోనుంది. హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలను కూడా తయారుచేసేలా ఈ ప్లాంటును ఏర్పాటు చేశారు. 2019 ఏడాది జనవరిలో కియా మోటార్స్ ట్రయల్ ఉత్పత్తి ప్రారంభించింది. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీలను ఈ ప్లాంటులో వినియోగిస్తోంది.
విదేశాలకు ఇక్కణ్నుంచే ఎగుమతులు..
సెల్టోస్ కారును ఇక్కణ్నుంచే దక్షిణాఫ్రికాతో పాటు ఇతర ప్రపంచ దేశాలకు కియా మోటార్స్ ఎగుమతి చేయనుంది. భారత్‌లో కియా మోటార్స్ దాదాపు 2 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేసింది. ఇందులో 1.1 బిలియన్ డాలర్లు అనంతపురం ప్లాంటుపైనే ఇన్వెస్ట్ చేసింది. దీనితో 11,000 మందికి ఉపాధి లభిస్తుందని కియా తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కియా తొలి కారు సెల్టోస్ ఆవిష్కరణ
ఎప్పుడు : ఆగ స్టు 8
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
ఎక్కడ : పెనుగొండ, అనంతపురం, ఆంధ్రప్రదేశ్

Published date : 09 Aug 2019 06:06PM