Skip to main content

కెయిన్స్ కప్ అంతర్జాతీయ టోర్నీ విజేతగా హంపి

కెయిన్స్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ చెస్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి విజేతగా నిలిచింది. అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో ఫిబ్రవరి 17న(భారత కాలమానం ప్రకారం) ముగిసిన ఈ టోర్నీలో హంపి ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని అలంకరించింది.
Current Affairs5.5 పాయింట్లతో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జూ వెన్‌జున్ (చైనా) రన్నరప్‌గా నిలువగా... 5 పాయింట్లతో మాజీ ప్రపంచ చాంపియన్ మరియా ముజిచుక్ (ఉక్రెయిన్) మూడో స్థానాన్ని సంపాదించింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి హారిక 4.5 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది.

తాజా ఫలితంతో హంపి 2585 ఎలో రేటింగ్ పాయింట్లతో ప్రపంచ లైవ్ ర్యాంకింగ్‌‌సలో మూడో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకుంది. చైనా గ్రాండ్‌మాస్టర్ హు ఇఫాన్ 2658 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోఉంది. 2019, డిసెంబర్‌లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నీలోనూ హంపి చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే.

పది మందికీ ప్రైజ్‌మనీ..
లక్షా 80 వేల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహించిన కెయిన్స్ కప్ టోర్నీలో పాల్గొన్న పది మందికీ ప్రైజ్‌మనీ ఇచ్చారు. విజేతగా నిలిచిన హంపికి 45 వేల డాలర్లు (రూ. 32 లక్షల 10 వేలు)... రన్నరప్ జూ వెన్‌జున్‌కు 35 వేల డాలర్లు (రూ. 24 లక్షల 97 వేలు)... మూడో స్థానంలో నిలిచిన మరియా ముజిచుక్‌కు 25 వేల డాలర్లు (రూ. 17 లక్షల 83 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
కెయిన్స్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు : ఆంధ్రప్రదేశ్ చెస్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి
ఎక్కడ : సెయింట్ లూయిస్, అమెరికా
Published date : 18 Feb 2020 05:41PM

Photo Stories