Skip to main content

కెనడా గ్రాండ్ ప్రి విజేతగా హామిల్టన్

కెనడా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేస్లో మెర్సిడెస్ డ్రైవర్లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. కెనడాలోని మాంట్రియల్‌లో జూన్ 10న జరిగిన ఈ రేసులో 70 ల్యాప్‌ల దూరాన్ని ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ అందరికంటే ముందుగా ముగించాడు.
కానీ నిబంధనలకు విరుద్ధంగా 50వ ల్యాప్‌లో మలుపు వద్ద ప్రమాదకరంగా ఓవర్‌టేక్ చేసినందుకు రేస్ స్టీవార్డ్‌లు వెటెల్‌పై 5 సెకన్ల పెనాల్టీ వేశారు. దీంతో గంటా 29 నిమిషాల 07.084 సెకన్లలో రేసును పూర్తి చేసిన హామిల్టన్‌ను విజేతగా ప్రకటించారు. వెటెల్ రెండో స్థానానికి పరిమితమయ్యాడు. సీజన్‌లోని తదుపరి రేసు ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి జూన్ 23న జరుగుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కెనడా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేస్ విజేత
ఎప్పుడు : జూన్ 10
ఎవరు : మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్
ఎక్కడ : మాంట్రియల్, కెనడా
Published date : 11 Jun 2019 06:49PM

Photo Stories