Skip to main content

కేన్సర్‌ను గుర్తించే కృత్రిమ మేధ అభివృద్ధి

మలేరియా, క్షయతోపాటు గర్భాశయ కేన్సర్‌నువేగంగా గుర్తించే కృత్రిమ మేధ(ఏఐ)పరికరాన్ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)-ఢిల్లీ పరిశోధకులుఅభివృద్ధి చేశారు.
వ్యాధులను గుర్తించేందుకు ఇప్పటికే కృత్రిమ మేధతో పనిచేసే పరికరాలు ఉన్నప్పటికీ, వాటితో వ్యాధులను నిర్ధారించేందుకు గంటల సమయం పడుతుంది. అయితే ఐఐటీ-ఢిల్లీ పరిశోధకులు రూపొందించిన ఏఐ పరికరం మిల్లి సెకన్ల వ్యవధిలోనే మలేరియా, గర్భాశయ కేన్సర్ వంటి వ్యాధులను గుర్తిస్తుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
గర్భాశయ కేన్సర్‌ను గుర్తించే కృత్రిమ మేధ అభివృద్ధి
ఎప్పుడు : మార్చి 26
ఎవరు : ఐఐటీ-ఢిల్లీ పరిశోధకులు
Published date : 27 Mar 2019 04:53PM

Photo Stories