కేంద్రమంత్రి హర్‌సిమ్రత్ కౌర్ రాజీనామా
Sakshi Education
కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమ మంత్రి, శిరోమణి అకాలీదళ్(ఎస్‌ఏడీ) నేత హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ సెప్టెంబర్ 17న తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమ మంత్రి పదవికి రాజీనామా
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : హర్‌సిమ్రత్ కౌర్ బాదల్
ఎందుకు : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు బిల్లులకు వ్యతిరేకంగా
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు బిల్లులకు వ్యతిరేకంగా కేబినెట్ మంత్రి అయిన హర్‌సిమ్రత్ కౌర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ బిల్లులను ఎస్‌ఏడీ అధ్యక్షుడు, ఆమె భర్త సుఖ్బీర్ సింగ్ బాదల్ లోక్‌సభలో తీవ్రంగా వ్యతిరేకించారు. అవి పంజాబ్‌లో వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయన్నారు.
ఎన్‌డీఏలో శిరోమణి అకాలీదళ్ బీజేపీకి అత్యంత విశ్వసనీయ భాగస్వామ్య పక్షం. బీజేపీకి తొలి నుంచి మద్దతుగా నిలిచిన పార్టీ. అయితే, వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు బిల్లులను ఎస్‌ఏడీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లులను విపక్షాలు, రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్ర రైతులు వీటిని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టారు.
ఎన్‌డీఏలో శిరోమణి అకాలీదళ్ బీజేపీకి అత్యంత విశ్వసనీయ భాగస్వామ్య పక్షం. బీజేపీకి తొలి నుంచి మద్దతుగా నిలిచిన పార్టీ. అయితే, వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు బిల్లులను ఎస్‌ఏడీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లులను విపక్షాలు, రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్ర రైతులు వీటిని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమ మంత్రి పదవికి రాజీనామా
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : హర్‌సిమ్రత్ కౌర్ బాదల్
ఎందుకు : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు బిల్లులకు వ్యతిరేకంగా
Published date : 18 Sep 2020 05:13PM