కేంద్రం, రాష్ట్రాలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
Sakshi Education
మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆందోళన వ్యక్తం చేసింది.
లైంగిక వేధింపుల కేసుల విషయంలో ఏ విధంగా స్పందిస్తున్నారు? నిర్భయ నిధుల వినియోగం ఎలా ఉంది? అనే వివరాలు కోరుతూ కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ) ప్రభుత్వాలకు డిసెంబర్ 2న నోటీసులు జారీ చేసింది. గత మూడేళ్లలో నిర్భయ నిధులను వినియోగించిన తీరును, ప్రస్తుతం ఆ నిధులు ఏ మేరకు ఉన్నాయనే విషయాన్ని తెలుపుతూ ఆరు వారాల్లోగా తమకు నివేదిక అందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతుండటంపై మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ)
ఎందుకు : మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతుండటంతో
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ)
ఎందుకు : మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతుండటంతో
Published date : 03 Dec 2019 06:06PM